జార్ఖండ్ కు చెందిన హిమాన్షు మిశ్రా అనే 22 ఏళ్ళ యువకుడు ఎక్కువగా ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. చదువులోనూ టాప్ స్టూడెంట్. ఐఐటీ జేఈఈ లో ఏకంగా 98 శాతం మార్కులను సాధించాడు. కానీ ఈ ఆన్ లైన్ గేమ్స్ ఇతని జీవితాన్ని ఒక్కసారిగా చిన్న భిన్నం చేశాయి. అతని బంగారు భవిష్యత్తుని రోడ్డున పడేశాయి. డ్రీమ్-11, మహాదేవ్ యాప్ వంటి ఆన్‌లైన్ గేమ్స్‌లో మొదట సరదాగానే గేమ్స్ ను స్టార్ట్ చేసిన అతనికి క్రమంగా అది వ్యసనంగా మారింది. కేవలం రూ. 49తో మొదలు పెట్టి క్రమంగా బెట్టింగ్‌ను పెంచుకుంటూ పోయాడు. తల్లిదండ్రులు కాలేజీ ఫీజు కోసం ఇచ్చిన డబ్బును కూడా గేమ్స్ లో పెడుతూ ఉండేవాడు. అలా స్నేహితులు , బంధువులు ఎవరు దొరికితే వారి వద్ద అప్పులు చేసేవాడు. ఈ క్రమంలోనే సుమారు రూ.96 లక్షల రూపాయలను ఆన్లైన్ గేమ్స్ ద్వారా పోగొట్టుకున్నాడు. ఇతని వ్యసనం కారణంగా అతని కుటుంబ ఆర్ధిక పరిస్థితి చిన్నా భిన్నం అయింది. ఇప్పటికి కొంతవరకు అప్పులు తీరినా, అతని కుటుంబం అతనిని ఇంటి నుంచి పంపించేశారు. తాజాగా యూట్యూబర్ షాలిని కపూర్ తివారీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి చెప్పుకొచ్చాడు. అతను ఎలా మోసపోయానని చెప్పిన విధానం అందరిని ఆలోచింపజేసింది. ఇంకా ఆన్ లైన్ గేమ్స్ ఆడే వారు ఎవరైనా ఉంటే ఇతన్ని చూసి ఇప్పటికైనా మేల్కొంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ホーム
/
హిమాన్షు మిశ్రా
/
ఆన్ లైన్ గేమ్స్ లో రూ. 96 లక్షలు పోగొట్టుకున్న యువకుడు !
الجمعة، 27 سبتمبر 2024
jarkhand national ఆన్ లైన్ గేమ్స్ లో రూ. 96 లక్షలు పోగొట్టుకున్న యువకుడు ఐఐటీ జేఈఈ లో 98 శాతం మార్కులను సాధించాడు హిమాన్షు మిశ్రా
ليست هناك تعليقات:
إرسال تعليق