తెలంగాలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ర్యాష్ డ్రైవింగ్ తో ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. ఇందులో ఓ మైనర్ కూడా ఉన్నాడు. గంగారం నుంచి రామ గోవిందాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను బేతి సురేష్ (25), ముత్తిన వేణు (18), కరీముల్లా (12)గా గుర్తించారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో రామ గోవిందాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యాక్సిడెంట్‌కు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సురేష్, వేణు బైక్‌పై రామ గోవిందపురానికి బైక్‌పై వెళ్తున్నారు. కరీముల్లా కూడా వాళ్ల ఊరు వాడే కావడంతో అతన్ని స్కూలు వద్ద ఎక్కించుకుని బయల్దేరారు. ట్రిపుల్ రైడింగ్, అందులోనూ అతి వేగం, వీటికి తోడు వెకిలి చేష్టలు వెరసి ముగ్గురి ప్రాణం తీశాయి. బైక్‌పై అతివేగంగా వెళ్తున్న వీళ్లు మూల మలుపు వద్ద స్కూటీపై వెళ్తున్న మహిళకు డ్యాష్ ఇచ్చారు. తర్వాత వాళ్లకు బైక్ కంట్రోల్ కాలేదు. ముందు లారీ ఆగి ఉంది. నేరుగా లారీని ఢీకొట్టేశారు. దీంతో స్పాట్‌లోనే ముగ్గురు చనిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ర్యాష్ డ్రైవింగ్ తో ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ముగ్గురు మృతి !
السبت، 3 أغسطس 2024
Criem telangana ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు ర్యాష్ డ్రైవింగ్ తో ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ముగ్గురు మృతి
ليست هناك تعليقات:
إرسال تعليق