పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం షీ-బాక్స్ పోర్టల్‌ను ప్రారంభించింది. దీనిని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి గురువారం ప్రారంభించారు. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఇంటర్నల్ కమిటీలు, స్థానిక కమిటీలకు సంబంధించిన సమాచారం దీనిలో ఉంటుందని ఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. బాధితురాళ్లు ఈ పోర్టల్ ద్వారా లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చు, దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నదో తెలుసుకోవచ్చు, సకాలంలో తమ సమస్యల పరిష్కారం జరిగేలా చేయవచ్చు. పని చేసే చోట జరిగే లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారానికి సమగ్ర వేదికగా ఇది పని చేస్తుందని అన్నపూర్ణ దేవి చెప్పారు.
మహిళల భద్రత కోసం షీ-బాక్స్ పోర్టల్ !
الجمعة، 30 أغسطس 2024
national కేంద్ర మహిళ మహిళల భద్రత కోసం షీ-బాక్స్ పోర్టల్ లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి
ليست هناك تعليقات:
إرسال تعليق