పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సెమీ ఫైనల్ చేరి సరికొత్త చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్ సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను తప్పిదాలతో చేజార్చుకున్నాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో లక్ష్యసేన్ 20-22, 14-21 తేడాతో రెండో సీడ్, డెన్మార్క్ ప్లేయర్ విక్టోర్ అక్సెల్సెన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఫస్ట్ గేమ్‌లో గేమ్ పాయింట్ ముందు సర్వీస్‌లో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మూడు పాయింట్స్‌లో వెనుకంజలో ఉన్న డెన్మార్క్ ప్లేయర్ తన అనుభవంతో పుంజుకొని లక్ష్యసేన్‌ను ఓడించాడు. లక్ష్యసేన సోమవారం జరిగే కాంస్యపోరులో తలపడనున్నాడు. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే అతనికి కాంస్య పతకం దక్కనుంది. సెమీఫైనల్లో ఒత్తిడిని అధిగమించడంలో లక్ష్యసేన్ విఫలమయ్యాడు.
సెమీఫైనల్లో లక్ష్యసేన్ ఓటమి !
الأحد، 4 أغسطس 2024
14-21 తేడాతో రెండో సీడ్ 20-22 olympics 2024 sports డెన్మార్క్ ప్లేయర్ విక్టోర్ అక్సెల్సెన్ చేతిలో ఓటమి సెమీఫైనల్లో లక్ష్యసేన్ ఓటమి సోమవారం జరిగే కాంస్యపోరులో తలపడనున్నాడు
ليست هناك تعليقات:
إرسال تعليق