ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఉపఎన్నికకు కూటమి దూరంగా ఉండనుంది. ఈ మేరకు తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. గెలవాలంటే పెద్ద కష్టం కాదని.. హుందా రాజకీయాలు చేద్దామని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్ణయానికి తెదేపా, కూటమి నేతలు ఆమోదం తెలిపారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారన్నారు. ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు.

Post a Comment

أحدث أقدم