ఖమ్మంలో కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్‌బాబు (40) కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటారు. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన ఇంట్లో పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వేడినీళ్ల కోసం హీటర్ ఆన్ చేయబోయారు. ఈలోగా ఫోన్ రావడంతో మాట్లాడుతూ హీటర్‌ను నీటిలో బదులు చంకలో పెట్టుకుని స్విచ్ ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయారు. దగ్గర్లో ఉన్న ఆయన తొమ్మిదేళ్ల కుమార్తె శభన్య భయంతో కేకలు వేస్తూ పరుగెత్తింది. దీంతో అప్రమత్తమైన భార్య దుర్గాదేవి, స్థానికులు మహేశ్‌బాబును ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు మూడో పట్టణ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ తెలిపారు.
అనాలోచితంగా హీటర్‌ను చంకలో పెట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి దుర్మరణం !
الاثنين، 12 أغسطس 2024
khamam telangana అనాలోచితంగా హీటర్‌ను చంకలో పెట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై వ్యక్తి దుర్మరణం ఫోన్ రావడంతో మాట్లాడుతూ హీటర్‌ను నీటిలో బదులు చంకలో పెట్టుకుని
ليست هناك تعليقات:
إرسال تعليق