తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్ పంటకు నీరు అందేలా చూస్తామని, రబీ పంటకు మాత్రం నీరు అందించడం కష్టమేనని... కాబట్టి రైతులు సహకరించాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో ఆయన ఆదివారం డ్యాంను పరిశీలించారు. గేటు ధ్వంసం కావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్యాంకు గేటును బిగించే అంశంపై మాట్లాడారు.19వ గేటు ధ్వంసం కావడం బాధకరమన్నారు. ఈ డ్యామ్ కర్నాటక - ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మూడు రాష్ట్రాలకు వరప్రదాయిని అన్నారు. ఈ డ్యామ్‌లో 40 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. మిగతా నీటిని దిగువకు విడుదల చేస్తే గేటు మరమ్మతులకు అవకాశం ఉంటుందన్నారు. వీలైనంత త్వరగా గేటును పునరుద్ధరిస్తామన్నారు

Post a Comment

أحدث أقدم