ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతేడాది ఫిబ్రవరి 26న ఈ కేసులో అరెస్ట్ అయిన సిసోడియా అప్పటి నుంచి బెయిల్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. దాదాపు 17 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇన్నాళ్లకు ఆయనకు ఉపశమనం దొరికింది. సీబీఐ సహా ఈడీ కేసులోనూ బెయిల్ ఇచ్చింది. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లకూడదని కండీషన్ పెట్టింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీడ్ ట్రయల్కి ఆయనకు హక్కు ఉందని తేల్చి చెప్పింది. "దాదాపు 17 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. స్పీడీ ట్రయల్కి వెళ్లే హక్కు ఆయనకు ఉంది. ట్రయల్ కోర్టు, హైకోర్టు ఆయనకు ఈ హక్కు కల్పించాల్సింది" అని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. బెయిల్ ఇస్తూ కోర్టు కొన్ని కండీషన్స్ పెట్టింది. సాక్ష్యులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడది తేల్చి చెప్పింది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. అంతకు ముందు ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టు సిసోడియాకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆయన వాదనను పట్టించుకోవాల్సింది అని వ్యాఖ్యానించింది. ఇప్పటికే ఆప్ నేత సంజయ్ సింగ్ కి ఇదే కేసులో బెయిల్ లభించింది.
మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు !
الجمعة، 9 أغسطس 2024
national New Delhi గతేడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం జస్టిస్ బీఆర్ గవాయ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు
ليست هناك تعليقات:
إرسال تعليق