Ad Code

కుమార్తెతో కలిసి తల్లి క్లినిక్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు రూపంలో తల్లిని కబళించిన మృత్యువు ?


త్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో కిద్వాయ్ నగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం తన 12 ఏళ్ల కుమార్తెతో కలిసి తల్లి స్కూటర్‌పై వెళ్తోంది. ఇంతలో 100 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న కారు అదుపు తప్పి వారిని ఢీకొట్టింది. దీంతో 30 అడుగుల ఎత్తు పైకిలేచి క్రింద పడ్డారు. ఈ ఘటనలో తల్లి చనిపోగా, కుమార్తె తీవ్రగాయాలయ్యాయి. క్లినిక్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. మృతురాలు హెల్మెట్ ధరించినా ప్రాణాలు నిలువలేదు. ప్రాణ భయంతో తనువు చాలించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇద్దరు మైనర్ బాలురు, ఇద్దరు బాలికలు స్కూల్‌కు వెళ్లకుండా కారులో విన్యాసాలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల మైనర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Post a Comment

0 Comments

Close Menu