భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లో అవసరమైన నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఆగస్టు 19 నుంచి 23 వరకు ఫ్రీ ఐదు రోజుల ఆన్‌లైన్ కోర్సును నిర్వహించబోతోంది. ఐఐఆర్‌ఎస్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ‘ఐఐఎస్’పై ఈ ఉచిత ఐదు రోజుల కోర్సును అందిస్తోంది. అంతరిక్ష రంగంలో సరికొత్త ఆవిష్కరణలను అందించడమే లక్ష్యంతో ఈ అత్యాధునిక కోర్సులను అందించనుంది. ఈ కోర్సు ప్రొగ్రామ్‌కు హాజరు కావడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 2007లో ప్రారంభమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ 3,500 పైగా నెట్‌వర్క్ ఇన్‌స్టిట్యూట్‌లకు విస్తరించింది. యూనివర్శిటీలు, ప్రభుత్వ విభాగాలు, పరిశోధనా సంస్థలు, ఎన్‌జీఓలకు ప్రయోజనం చేకూర్చింది. జియోస్పేషియల్ టెక్నాలజీ, అప్లికేషన్లలో కెపాసిటీ బిల్డింగ్‌ను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించింది. ఫ్రీ ఇస్రో కోర్సు సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, జియోఇన్ఫర్మేటిక్స్ వంటి రంగాలలో నిపుణులు, విద్యార్థులు, పరిశోధకుల కోసం రూపొందించింది. జియోస్పేషియల్ అప్లికేషన్‌ల కోసం ఏఐ, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ని అన్వేషించడానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థులకు ఐదు రోజుల ఉచిత ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సు !
الأربعاء، 7 أغسطس 2024
national science technology ఆగస్టు 19 నుంచి 23 వరకు ఫ్రీ ఐదు రోజుల ఆన్‌లైన్ కోర్సు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మెషిన్ లెర్నింగ్ కోర్సు విద్యార్థులకు ఐదు రోజుల ఉచిత ఏఐ
ليست هناك تعليقات:
إرسال تعليق