తెలంగాణలో కె. కేశవరావు రాజీనామాతో రాజ్యసభ ఉప ఎన్నికకు  కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది.  ఈరోజు నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరణ ఉండనుంది. ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఈసీ ప్రకటించనుంది. ఒకవేళ ఎన్నిక అవసరమైతే.. సెప్టెంబర్‌ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది.

Post a Comment

أحدث أقدم