ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా వంగర మండలం ప్రజలను గజరాజులు మళ్లీ వణికించాయి. అటవీ ప్రాంతం నుంచి గ్రామ శివారు ప్రాంతాల్లోకి తరచూ ఏడు ఏనుగులు వచ్చి సంచరిస్తున్నాయి. రాజులగుమడ, జేకే, గుమడ గ్రామాల మధ్య పంట పొలాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. మొక్కజొన్న, వరి, చెరుకు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అయితే గున్నకు ఆడ ఏనుగు జన్మనిచ్చింది. ఈ గున్న ఏనుగుకు సెక్యూరిటీగా పెద్ద ఏనుగులు కాపలా కాస్తున్నాయి. అయితే రాత్రి సమయంలో గ్రామాల్లోకి సైతం వస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు కేవలం ట్రాకింగ్ చేస్తున్నారని, నివారణ చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామాల్లోకి రాకుండా ఏనుగులను కట్టడి చేయాలని కోరారు.
విజయనగరం జిల్లా గ్రామాల్లో ప్రజలను వణికిస్తున్న ఏనుగులు !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق