సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కొండ ప్రాంతంలోని రోడ్డు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఓ ప్రాంతంలో కొండలో సొరంగ మార్గంలో వాహనదారులు చూస్తుండగానే రోడ్డు కూలిపోయింది. రోడ్డు చివర భాగం కూలిపోవడంతో కొందరు తమ వాహనాలను రోడ్డు పక్కన ఆపి వీడియోలు తీస్తున్నారు. ఇలా వాహనదారులు చూస్తుండగానే రోడ్డు ఓ వైపు నుంచి మరో వైపునకు మొత్తం కూలిపోయింది. ఈ ఘటనతో ఎదురుగా వస్తున్న మరికొన్ని వాహనాలు దూరంగా ఆగిపోయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగనట్లు తెలుస్తోంది. కొండచరియలు విరిగిపడడంతోనే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన టర్కీలో ఏడాది క్రితం భారీ వర్షాల కారణంగా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''వామ్మో చూస్తుంటేనే బయంగా ఉంది''.. అంటూ కొందరు, ''ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి''.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
0 Comments