ఆంధ్రప్రదేశ్ లో జూలై నెలాఖరు రోజున వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపుగా ఏడు వేల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ అనంతర భత్యాలు ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో గత జగన్ ప్రభుత్వం రెండేళ్ల పదవీ విరమణ వయసును పెంచింది. దాంతో ఉద్యోగుల రిటైర్మెంట్లు లేకుండా పోయాయి. ఇప్పుడు ఆ రెండేళ్లు పూర్తయిపోవడంతో అందరూ మూకుమ్మడిగా రిటైర్ అవుతున్నారు. మొదట 58 ఏళ్లుగా ఉండే రిటైర్మెంట్ వయసు ఇప్పుడు అరవై రెండుకు చేరింది. 58 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఉంటే ఇప్పటికే మరో నలభై వేల మంది వరకూ రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాలన్నీ యువతకు వచ్చేవి. కానీ రాజకీయ స్వార్థం… వారు రిటైరైతే జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితుల వల్ల వయసు పెంచుతూ వచ్చారు. 

Post a Comment

أحدث أقدم