జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు రూపంలో ఈ ఏడాది మార్చి నాటికి రూ.83 కోట్లు వసూలు చేసింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ రుసుమును కస్టమర్ల ఆర్డర్లపై విధిస్తున్న విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం పుంజుకోవడానికి ఈ ఫీజూ ఒక కారణమని కంపెనీ తెలిపింది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదిలో జొమాటో సర్దుబాటు చేసిన ఆదాయం 27 శాతం పెరిగి రూ.7,792 కోట్లకు పెరిగింది. గోల్డ్ కస్టమర్లకు ఇచ్చే ఉచిత డెలివరీ వల్ల కొంత రాబడి తగ్గింది. అయితే అధిక ఆదాయం ప్లాట్‌ఫామ్ ఫీజు, ఆర్డర్ల సంఖ్య పెరగడం సహా ఇతర మార్గాల ద్వారా సమకూరిందని జొమాటో తెలిపింది. మరోవైపు గత ఏడాదిలో రాత్రి పొద్దుపోయాక వచ్చిన ఆర్డర్లలో అత్యధికం దిల్లీ నుంచేనని తెలిపింది. ఉదయం అల్పాహారం ఆర్డర్లు బెంగళూరు నుంచి ఎక్కువగా అందాయని వెల్లడించింది.
ప్లాట్‌ఫామ్ ఫీజుతో జొమాటోకు రూ.83 కోట్ల ఆదాయం
الأحد، 4 أغسطس 2024
business food national science technology ఉదయం అల్పాహారం ఆర్డర్లు బెంగళూరు నుంచి ఎక్కువగా అందాయని వెల్లడి ప్లాట్‌ఫామ్ ఫీజుతో జొమాటోకు రూ.83 కోట్ల ఆదాయం
ليست هناك تعليقات:
إرسال تعليق