ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 22ఏ, ప్రీహోల్డ్ భూములపై రీ సర్వే చేయాలని, సర్వే రాళ్లపై ఉన్న జగన్ బొమ్మల తొలగించాలని తీర్మానించింది. సెబ్ రద్దు చేసి ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించాలని, రివర్స్ టెండరింగ్ విధానానికి ముగింపు పలకాలని, పోలవరం ఎడమకాలువ పురుద్ధరణ, కాలువ సామర్థ్యాన్ని ఆరు వేల క్యూసెక్కులకు పెంచేలా నిర్ణయం తీసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకి కూడా కేబినెట్ ఓకే చెప్పింది. వీటితోపాటు రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ పోస్టులు భర్తీ చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. కొత్తగా 2,771 రేషన్ దుకాణాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాల్టి నుంచి పేపర్ లెస్ కేబినెట్ మీటింగ్ నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2014-19 మధ్య ఇలా పేపర్ లెస్ కేబినెట్ చంద్రబాబు నిర్వహించే వాళ్లు. తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ విధానానికి స్వస్తి చెప్పారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో పేపర్ లెస్ విధానం తీసుకొచ్చారు. ఈ విధానంలో మంత్రులకు ఆన్ లైన్ లోనే నోట్ ఇతర వివరాలు అందజేస్తారు. ఇప్పటికే మంత్రులకు సహాయం చేసే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
إرسال تعليق