చండీఘడ్ లోని మణిమజ్రాలో ఓ నీటి సరఫరా చేసే ప్రాజెక్టును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించి మాట్లాడుతూ ప్రతీ పక్షాలు ఏం చెప్పినప్పటికీ బీజేపీ నేతలు ఆందోళన చెందొద్దన్నారు. ఎందుకంటే 2029లో కూడా ఎన్డీఏ నే అధికారంలోకి రాబోతుందని, మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ అవుతారని తెలిపారు. ఈ విషయం పై తాను స్పష్టమైన హామీ ఇస్తున్నానని వెల్లడించారు. కొంత విజయంతో తాము ఎన్నికల్లో గెలిచామని ప్రతిపక్షాలు భావిస్తున్నారని, కానీ మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వచ్చాయో.. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ దానికంటే ఎక్కువ సీట్లు సాధించిందని వారికి తెలియదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదని చెబుతున్న వారు దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
2029లో కూడా ఎన్డీఏదే విజయం
الأحد، 4 أغسطس 2024
2029లో కూడా ఎన్డీఏదే విజయం haryana national punjab ఈ విషయం పై తాను స్పష్టమైన హామీ ఇస్తున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ అవుతారని
ليست هناك تعليقات:
إرسال تعليق