స్మృతీ ఇరానీ పట్ల అసహ్యంగా మాట్లాడటం మానుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి !


కేంద్ర మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీపై అవమానకరమైన పదజాలం, అసహ్యంగా మాట్లాడటం మానుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన మద్దతుదారులకు, కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలను అవమానించడం బలహీనకు సంకేతమని, బలం కాదని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. యూపీ అమేథీ నుంచి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్మృతీ ఇరానీ, కాంగ్రెస్ నేత కిషోరీ లాల్ శర్మ చేతిలో 1,67,196 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ''జీవితంలో గెలుపు ఓటములు జరుగుతాయి. శ్రీమతి స్మృతి ఇరానీ లేదా మరే ఇతర నాయకుడి పట్ల అవమానకరమైన పదజాలం ఉపయోగించడం, అసహ్యంగా ప్రవర్తించడం మానుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ప్రజలను అవమానించడం బలహీనతకు సంకేతం, బలం కాదు'' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.


Post a Comment

0 Comments