హీరో నవీన్ పొలిశెట్టి అమెరికాలోనే ఉంటున్నట్లు, ఇటీవల ఆయనకు యాక్సిడెంట్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, నవీన్ పొలిశెట్టి తనకు తీవ్రమైన గాయాలు అయినట్లు తొందరలోనే సినిమాలు చేస్తానని ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ''దురదృష్టవశాత్తూ నా చేతికి అనేక ఫ్రాక్చర్లు అయ్యాయి. అలాగే నా కాలికి కూడా గాయమైంది. ఇది చాలా కష్టంగా ఉంది కానీ పూర్తిగా కోలుకునే దిశగా పని చేస్తున్నాను. కాబట్టి నేను మీ కోసం నా శక్తి వంతమైన పనిని చేయగలను. మీ మద్దతు, ఓర్పు, ప్రేమ మాత్రమే నాకు అవసరమైన ఔషధం. అభివృద్ధిలో ఉత్తేజకరమైన సినిమాలు చేయడానికి మీ సపోర్ట్ కావాలి. దయచేసి నా నుండి వచ్చే అప్‌డేట్‌లను మాత్రమే నమ్మండి. త్వరలో పెద్ద స్క్రీన్‌పై మిమ్మల్ని అలరించడానికి వేచి ఉండలేను. మీరంతా బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. ఎప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ జానే జిగర్'' అని రాసుకొచ్చాడు. అలాగే ఓ ఎమోషనల్ నోట్‌ను షేర్ చేస్తూ తనకు గాయాలైన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టాడు.
0 Comments