కేంద్రం బడ్జెట్లో పిల్లలకు ఆర్థిక భరోసాను కల్పించేందుకు ఎన్‌పీఎస్ వాత్సల్య అనే స్కీమ్ ను తీసుకొచ్చింది. దీని కింద చిన్నారుల భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు, గార్డియన్లు ఇందులో డబ్బులను జమ చేసుకోవచ్చు. పిల్లలకు18 ఏండ్ల వయస్సు వచ్చాక ఈ పథకాన్ని నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పీఎస్) పాలసీగా మార్చుకోవచ్చు. పోస్టాఫీసు లేదా జాతీయ బ్యాంకులో నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) కింద వాత్సల్య ఖాతాను తెరవాల్సి ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులు ప్రతి నెలా లేదా నిర్దిష్ట వ్యవధిలో ఈ ఖాతాలో డబ్బులను పొదుపు చేసుకోవచ్చు.
0 Comments