హైదరాబాద్ లో కదులుతున్న బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. మహిళ డయల్ 100 నంబర్‌కు కాల్ చేయడంతో విషయం వెలుగు చూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్‌లో ఓ మహిళ నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తుంది. ఈ బస్‌లో కృష్ణ, సిద్దయ్య ఇద్దరు డ్రైవర్లుగా ఉన్నారు. బస్సులో వేరే ప్రయాణికులు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన డ్రైవర్లు బస్సు అద్దాలను క్లోజ్ చేశారు. ఆ తర్వాత సిద్దయ్య బస్సు నడుపుతుండగా కృష్ణ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. బాధిత మహిళ వెంటనే డయల్ 100 నంబర్‌కు కాల్ చేసి తనపై జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు బస్ ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు సిద్దయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మరో డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం !
الثلاثاء، 30 يوليو 2024
Criem telangana కృష్ణ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం మహిళ డయల్ 100 నంబర్‌కు కాల్ చేయడంతో విషయం వెలుగు హైదరాబాద్‌లో కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం
ليست هناك تعليقات:
إرسال تعليق