ఆస్ట్రేలియాలోని బైరాన్ బే తీరంలో రిక్ షీర్‌మాన్ బాడీ సర్ఫింగ్ చేస్తున్నారు. తొలుత ఆ తీరంలో సంతోషంగా గడిపిన షీర్‌మాన్ తర్వాత పరిస్థితి క్రమంగా మారుతున్నట్లు గమనించాడు. అయితే ఆ బాడీ సర్ఫింగ్‌లో అనుభవం కారణంగా ఈ పరిస్థితులను తాను అధిగమించగలనని షీర్‌మాన్ భావించాడు. అయితే ఈ తీరంలో వస్తున్న పెద్ద అలలతో ఎక్కువ సార్లు మునిగి తేలాడు. దీంతో కొంత ఆందోళనకు గురయ్యాడు. ఎంతో అనుభవం ఉన్నా తీరానికి చేరుకొనేందుకు షీర్‌మాన్‌కు దారి కనిపించడం లేదు. సుమారు 20 నిమిషాలపాటు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. దీంతో తనకు సాయం అవసరమని, పరిస్థితి అదుపు తప్పుతుందని భావించాడు. అయితే తన భాగస్వామి తీరానికి సమీపంలో లేదని గ్రహించాడు. దీంతో తన చేతికి ధరించిన ఆపిల్ వాచ్ అల్ట్రా కనిపించింది. ఆపిల్ వాచ్ అత్యంత మెరుగైన డిజైన్‌ను కలిగి ఉంది. సుమారు 100 మీటర్ల నీటిలో ఉన్నా కూడా సమర్థంగా పనిచేస్తుంది. ఈ వాచ్ ద్వారా ఎమర్జెన్సీ విభాగానికి కాల్ చేయవచ్చని భావించాడు. భారీ అలల మధ్య అత్యవసర సేవల సిబ్బందితో మాట్లాడడం కష్టమని తొలుత భావించినా, మరో మార్గం లేక వెంటనే వాచ్ ద్వారా ఎమర్జెన్సీ బృందాలకు సమాచారం అందించాడు. అయితే భారీ అలల మధ్య వారితో మాట్లాడేందుకు వీలుగా చెవికి దగ్గరగా వాచ్‌ను పట్టుకున్నాడు. ఇలా సుమారు గంటపాటు అంటే అత్యవసర సేవల సిబ్బంది ఆ ప్రాంతానికి వచ్చే వరకు ఆ భారీ అలల మధ్య ప్రమాదకరంగా గడిపాడు. సముద్రం నుంచి సురక్షితంగా ఒడ్డుకు చేరాక తమ ప్రాణాలను కాపాడిన ఆపిల్ వాచ్ ఫీచర్లకు ధన్యవాదాలు తెలిపాడు. ఆపిల్ వాచ్ సాయంతో షీర్‌మాన్‌ను సులభంగా తీరానికి చేర్చామని, అదే ఆపిల్ వాచ్ లేకుంటే రెస్క్యూ ఆపరేషన్ కోసం గంటలు లేదా రోజులు పట్టే అవకాశం ఉండేదని, ప్రాణాలకు ముప్పు ఉండేదని ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న లైఫ్‌గార్డు తెలిపాడు.
భారీ అలల మధ్య చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ఆపిల్ వాచ్ ?
الخميس، 18 يوليو 2024
science technology భారీ అలల మధ్య చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ఆపిల్ వాచ్ ? సుమారు 100 మీటర్ల నీటిలో ఉన్నా కూడా సమర్థంగా పనిచేస్తుంది
ليست هناك تعليقات:
إرسال تعليق