టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన రాహుల్ ద్రవిడ్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ డిమాండ్ చేశారు. గవాస్కర్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒక ఆటగాడిగా, కోచ్, ఎన్సీఏ అకాడమీ చైర్మన్‌గా భారత క్రికెట్‌కు ద్రవిడ్ చేసిన సేవలకు భారతరత్న అవార్డ్ పొందేందుకు అర్హుడని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నో మ్యాచుల్లో భారత్‌కు మరుపురాని విజయాలు అందించిన ద్రావిడ్ కోచ్‌గానూ ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తోన్న వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించి 140 కోట్ల మంది ప్రజలను సంతోషపర్చారని కొనియాడారు. టీమిండియా వరల్డ్ కప్‌లో ప్లేయర్లతో పాటు ద్రావిడ్ పాత్ర కూడా కీలకమని చెప్పారు. కాగా, భారత దేశ చరిత్రలో క్రీడా రంగం నుండి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్న ఏకైక వ్యక్తి సచిన్ టెండూల్కర్ మాత్రమే.
ホーム
/
సునీల్ గవాస్కర్
/
రాహుల్ ద్రవిడ్ కు భారతరత్న ఇవ్వాలి : సునీల్ గవాస్కర్
الأحد، 7 يوليو 2024
cricket sports కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి క్రీడా రంగం నుండి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్న ఏకైక వ్యక్తి సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రవిడ్ కు భారతరత్న ఇవ్వాలి సునీల్ గవాస్కర్
ليست هناك تعليقات:
إرسال تعليق