దేశంలో పూర్తి శాకాహార నగరంగా పాలిటానా !

ప్రపంచంలోనే అత్యధిక శాకాహారులు ఉన్న దేశంగా ప్రపంచ అట్లాస్ నివేదిక ప్రకారం భారత్‌ నిలిచింది. దేశంలో 38 శాతం మంది శాకాహారులు ఉన్నారు. ఇదిలా ఉంటే, దేశంలోనే పూర్తి శాకాహార నగరంగా గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లాలో 'పాలిటానా' రికార్డుకెక్కింది. ఈ పట్టణంలో పూర్తిగా మాంసాహారం నిషేధం. గుడ్లతో పాటు మాంసాహారం ఈ పట్టణంలో పూర్తిగా నిషేధం. ఈ ప్రాంతంలో జైన సన్యాసులు మాంసాహార నిషేధం కోసం పెద్ద ఉద్యమమే చేశారు. 2014లో, ఈ ప్రాంతంలో దాదాపుగా 250 మాంసం దుకాణాలనున మూసేయాలని కోరుతూ 200 మంది సన్యాసులు నిరాహారదీక్ష చేశారు. జైన మతస్తుల మనోభావాలను గౌరవించేందు ఈ ప్రాంతంలో మాంసం, గుడ్లు, జంతువులను వధించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇవి ఉల్లంఘిస్తే భారీ జరిమానాలను విధిస్తుంది. ఆలయాల నగరంలో పాలిటానాకు పేరుంది. ఇక్కడి త్రుంజయ కొండపై 900 ఏళ్ల క్రితం నాటివిగా చెబుతున్న 800 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. పాలిటానాలో లభించే ఆహారం పూర్తిగా జైన వంటకాల నుంచి ప్రేరణ పొందింది. జైన వంటకాల్లో కొన్ని కూరగాయలను కూడా మినహాయిస్తారు. పాలిటానాలో సులువుగా దొరికే ప్రసిద్ధ వంటకాలలో ధోక్లా, ఖాండ్వీ, గతియా, కధి ఉన్నాయి. ప్రజలు మిల్లెట్స్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తృణధాన్యాలు, బెల్లం, నెయ్యి ఉపయోగించి 'రోట్లో' అనే పదార్థాన్ని తయారు చేస్తారు. 

Post a Comment

0 Comments