పంజాబ్ హోషియాపూర్‌లో ఆదివారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 2.6 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం ఒక్కసారిగా భయాందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు తీశాయి. ఈరోజు సాయంత్రం 4.12 గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేషనల్ సెంటర్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. స్వల్ప భూకంపం కావడంతో ఎలాంటి ప్రమాదం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం సైతం హర్యానాలోని ఝాజ్జర్‌లోని మహర్నా సమీపంలో భూకంపం సంభవించింది. భూమికి ఐదుకిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ అంతర్భాగంలో పలు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఒకదాంటో ఒకటి ఢీకొన్న సమయంలో భూ ప్రకంపనలు వస్తాయని భూగర్భశాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ది సిస్మిక్ జోనింగ్ మ్యాప్ ప్రకారం.. భూకంపాలను పలు జోన్లుగా విభజించారు. ఆయా జోన్లను భట్టి ప్రమాదం అంచనా వేస్తున్నారు. హోషియార్‌పూర్ ప్రాంతం జోన్-4లో ఉన్నది. రెండో జోన్‌లో తక్కువ ప్రమాదం ఉంటుంది. జోన్-ఐదులో అత్యధిక ప్రమాదం ఉంది. జోన్-2 స్కై బ్లూ, జోన్-3 మూడు యెల్లో, జోన్-ఆరెంజ్, జోన్-5 ఐదు ఎరుపు రంగులో ఉన్నాయి. జోన్-5 అత్యంత ప్రమాదకరంగా భూగర్భ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
0 Comments