తెలంగాణలోని మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. మౌలాలి ఆర్టీసీ కాలనీలో కొన్ని నెలలుగా మెయిన్ రోడ్ మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేశారని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే ఎదుట ఆగ్రహం వ్యక్తంచేశారు. పలుమార్లు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టినా ఫలితం లేదని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేని నిలదీసిన వారిపై మరో వర్గం దాడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది.
0 Comments