ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా వినుకొండలో అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేయడం తీవ్ర కలకలం సంచలనం కలిగించింది. వ్యక్తిగత కక్షలతో రషీద్ అనే వ్యక్తిపై జిలాని అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. చేతులపై, మెడపై, తలపై ఇలా విచక్షణా రహితంగా దాడి చేస్తూ ప్రాణం పోయే వరకు నరికి చంపాడు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నడిరోడ్డుపై హత్యా ఘటనపై ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూరషీద్ అనే వ్యక్తి ని జిలాని అనే యువకుడు నరికి హత్య చేశాడన్నారు. ఈ హత్యకు కారణం ఇద్దరికి వ్యక్తిగత ఘర్షణలు ఉన్నాయని, దీనిలో ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేదని ఎస్పీ సృష్టం చేశారు. వినుకొండలో జరిగిన దారుణ హత్య నేపథ్యంలో, పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నాం అని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు ఎస్పీ శ్రీనివాసరావు.
إرسال تعليق