ట్రంప్‌ హత్యకు కుట్ర ఆరోపణలను ఖండించిన ఇరాన్‌ !


మెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ హత్యకు కుట్ర పన్నుతున్నట్లు అమెరికా మీడియా కథనాలను ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. నిరాధార, దురుద్దేశపూరిత రాజకీయ ఆరోపణలని కొట్టిపారేసింది. ట్రంప్‌పై దాడికి కుట్ర పన్నిందన్న " ద్వేషపూరిత " ఆరోపణలను ఇరాన్‌ తిరస్కరించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నాసర్‌ కనాస్‌ బుధవారం స్పష్టం చేశారు. అయితే 2020లో సీనియర్‌ సైనిక అధికారిని హత్య చేయాలని ఆదేశించిన కేసులో ట్రంప్‌ను విచారించాలని అన్నారు. ట్రంప్‌పై ఇటీవల జరిగిన సాయుధ దాడిలో ఇరాన్‌ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఇరాన్‌తో ట్రంప్‌ ప్రాణాలకు ముప్పు ఉందని అధికారులకు ఇటీవల సమాచారం అందిందని అమెరికా అధికారులనుద్దేశించి జాతీయ మీడియా మంగళవారం పేర్కొంది. దీంతో ట్రంప్‌ భద్రతను పెంచడంతో పాటు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ను అప్రమత్తం చేసినట్లు నివేదించింది.

Post a Comment

0 Comments