ఒడిశాలోని పూరీలో విశ్వప్రసిద్ధ జగన్నాథుడి రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రథం లాగుతుండగా తోపులాట జరగడంతో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు 300 మందికిపైగా స్వల్పగాయలైనట్లు సమాచారం. గాయాలపాలైన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ రథాలపై చెరాపహరా (బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చడం) పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటలకు రథాలకు సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కట్టారు. అనంతరం బలభద్రుని తాళధ్వజ రథం ముందుకు కదిలింది. ఆ తర్వాత కొద్ది సేపటికే భక్తుల మధ్య తోపులాట జరిగింది.
పూరీ రథయాత్రలో రథం లాగుతుండగా తోపులాట జరగడంతో ఒకరి మృతి !
الأحد، 7 يوليو 2024
Odisha దాదాపు 300 మందికిపైగా స్వల్పగాయాలు పూరీ రథయాత్రలో రథం లాగుతుండగా తోపులాట జరగడంతో ఒకరి మృతి భక్తుల మధ్య తోపులాట
ليست هناك تعليقات:
إرسال تعليق