అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024 జులై 20, 21 తేదీల్లో కొనసాగనుంది. ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా తీసుకొస్తున్న ఈ సేల్‌లో 450 కంటే ఎక్కువ బ్రాండ్‌ల ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. మొబైల్, ల్యాప్‌టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులతో పాటు ఇతర ప్రొడక్టులపైనా భారీగా డిస్కౌంట్లు లభించనున్నాయి. ఈ సేల్ సమయంలో శాంసంగ్, ఐక్యూ, హానర్, లావా, మోటోరోలా, వన్‌ప్లస్ నుంచి లాంచ్ అయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉంటాయని కూడా అమెజాన్ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఎం35, ఐక్యూ జెడ్9 లైట్ 5జీ ఫోన్‌లు జూలై 17న దేశంలో లాంచ్ కానున్నాయి. ఇవి అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో విక్రయించబడతాయి. హానర్ 200, హానర్ 200 ప్రో ఫోన్‌లు కూడా జూలై 18న భారత్‌లో లాంచ్ కానున్నాయి. ప్రైమ్ డే సేల్‌లో ఇవి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. లావా బ్లేజ్ ఎక్స్ జూలై 10న భారత్‌లో విడుదల కానుంది. ఈ ఫోన్ ప్రైమ్ డే సేల్ 2024 సమయంలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో లాంచ్ అయిన మోటోరోలా రేజర్ 50 అల్ట్రాకూడా అమ్మకాన్ని వస్తోంది. ఈ సేల్‌లో పెద్ద ఎత్తున డిస్కౌంట్ కూడా పొందొచ్చు. 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.99,999గా ఉండగా.. సేల్ సమయంలో రూ.10వేలు తగ్గింపు లభించనుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అల్ట్రా ఆరెంజ్ కలర్ వేరియంట్‌లో అమ్మకానికి రానుంది. వన్‌ప్లస్ 12ఆర్, రెడ్‌మీ 13, రియల్‌మీ జీటీ 6టీ కొత్త కలర్ వేరియంట్‌లో అమ్మకానికి ఉంటాయి.
జులై 20, 21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024 !
الاثنين، 8 يوليو 2024
21 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024 science technology ఈ సేల్‌లో 450 కంటే ఎక్కువ బ్రాండ్‌ల ఉత్పత్తులు అందుబాటులో జులై 20 ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా
ليست هناك تعليقات:
إرسال تعليق