లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జిందాల్ స్టీల్ కంపెనీ సీఈవో దినేశ్ కుమార్ సరోగీపై కోల్‌కతా పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. దినేశ్ కుమార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, లైంగికంగా వేధించాడని కోల్‌కతాకు చెందిన ఓ మహిళ ఇటీవల ఎక్స్ వేదికగా ఆరోపించారు. 'నేను కోల్‌కతా నుంచి అబుదాబికి విమానంలో వెళ్తున్న సమయంలో దినేశ్ కుమార్ సరోగీ అనే వ్యక్తి నా పక్క సీట్లో కూర్చున్నారు. తాను జిందాల్ స్టీల్ సీఈవోనని పరిచయం చేసుకొని మాటలు కలిపారు. అనంతరం ఆయన ఫోన్‌లోని పోర్న్ వీడియోలు నాకు చూపిస్తూ అసభ్యంగా తాకారు. దాంతో నేను ఒక్కసారిగా షాకయ్యాను. భయంతో అక్కడి నుంచి వాష్ రూమ్‌కి వెళ్లి ఎయిర్ స్టాఫ్‌కి ఫిర్యాదు చేశాను. వారు నన్ను తమ సీటింగ్ ఏరియాలో కూర్చోబెట్టారు. నేను కనిపించకపోయేసరికి నా గురించి తెలుసుకోవడానికి దినేశ్ ఎయిర్‌లైన్ సిబ్బందికి పలుమార్లు ఫోన్ చేశారు' అని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు అబుదాబి పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. మహిళ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆదివారం కోల్‌కతాలోని బిధాన్‌నగర్ సిటీ పోలీసులు కూడా దినేశ్ కుమార్‌పై కేసు నమోదైంది. ఘటన అనంతరం బాధిత మహిళ 'జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఛైర్మన్, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన జిందాల్ తాను ఇలాంటి వాటిని క్షమించనని అన్నారు. దర్యాప్తు చేయాలని తమ బృందాన్ని కోరామని, నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిందాల్ స్టీల్ సీఈవో దినేశ్ సరోగీపై కేసు నమోదు !
الأحد، 21 يوليو 2024
business Criem national జిందాల్ స్టీల్ సీఈవో దినేశ్ సరోగీపై కేసు నమోదు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని లైంగిక వేధింపుల ఆరోపణలు లైంగికంగా వేధించాడని
ليست هناك تعليقات:
إرسال تعليق