800 మెగావాట్ల అధునాతన అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ ఆధారితపవర్‌ ప్లాంట్‌ ప్రతిపాదన !


ఎంటీపీఎస్ లిమిటెడ్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ మధ్య జాయింట్‌ వెంచర్‌ ద్వారా 800 మెగావాట్ల అధునాతన అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీ ఆధారిత పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని 2024-25 కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదించింది. ఈ ప్లాంట్‌కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ ప్లాంట్‌ కోసం హై-గ్రేడ్‌ స్టీల్‌, ఇతర అధునాతన మెటలర్జీ పదార్థాలను ఉత్పత్తి చేసే స్వదేశీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థకు బలమైన వృద్ధి ప్రయోజనాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. భారత్‌ 2032 ఆర్థిక సంవత్సరం నాటికి 85 గిగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్స్‌ను జోడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇటీవల కాలంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను భారీ ఎత్తున ప్రైవేట్‌ రంగంలో కూడా ప్రొత్సహిస్తోంది.

Post a Comment

0 Comments