ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 70 గంటల పని విధానాన్ని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ మళ్లీ సమర్థించారు. ఓలా బాస్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.."మూర్తి 70 గంటల పని వారం అని చెప్పినప్పుడు.. నేను బహిరంగంగా మద్దతు పలికాను. దాంతో సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ అయ్యాను. కానీ, నేను నేను వాటిని పట్టించుకోను. ఎందుకంటే ఒక తరం తపస్సు చేయవలసి ఉంటుంది. తద్వారా ప్రపంచంలోనే నంబర్ వన్ దేశాన్ని, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నిర్మించగలం అనే బలమైన నమ్మకం నాకు ఉంది. అలాగే, పని-జీవిత సమతుల్యత భావనతో నేను ఏకీభవించను. ఎందుకంటే.. మీరు మీ పనిని ఆస్వాదిస్తూ ఉంటే.. మీరు జీవితంలో కూడా ఆనందాన్ని పొందుతారు. పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు'' అని అగర్వాల్ చెప్పుకొచ్చారు. అంతకుముందు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. గడచిన 2 నుంచి 3 దశాబ్దాలలో అద్భుతమైన పురోగతిని సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువకులు వారానికి 70 గంటలు పని చేయాలని సలహా ఇచ్చారు. అది కాస్తా దేశంలో పెద్ద చర్చకు దారితీసింది.
వారానికి 70 గంటల పనిని సమర్థించిన ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ !
السبت، 13 يوليو 2024
science technology ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి వారానికి 70 గంటల పనిని సమర్థించిన ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ సోషల్ మీడియాలో భారీగా ట్రోల్
ليست هناك تعليقات:
إرسال تعليق