ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ !


నెల 23న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే నిర్మలా సీతారామన్ ఆర్బీఐ గవర్నర్ తో భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల ముందు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు పూర్తి స్థాయి పద్దుని ప్రకటించనున్నారు. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా వెల్లడించారు. జులై 23న కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టేందుకు ఆమోదం లభించిందని తెలిపారు.

Post a Comment

0 Comments