హైదరాబాద్‌ లో 16.1 కిలోల గంజాయి పట్టివేత !


డిశా నుంచి బస్సులో రూ.3 లక్షల విలువ చేసే గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తున్న విషయమై నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో హయత్ నగర్ వద్ద బస్సులో తనిఖీ చేసి 16.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టీఎఫ్ టీమ్‌ లీడర్‌ ఎన్‌. అంజి రెడ్డి తెలిపారు. గంజాయిని ఒడిశా నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తున్న జయదేవ్‌ నెలూర్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. దీనిపై పోలీసులు ప్రశ్నించినప్పుడు ధూల్‌పేటలోని అశోక్ సింగ్‌కు ఇవ్వడానికి గంజాయి తెచ్చినట్లు జయదేవ్ నెలూర్ చెప్పాడు. కాగా, అశోక్ సింగ్ తప్పించుకున్నాడని ఎస్టీఎఫ్ పోలీసులు చెప్పారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా ఒడిశా వ్యక్తి మిలన్‌దేవ్‌నాథ్ గంజాయిని అమ్మకాలు సాగించేవాడు. ఆయనపై పలు కేసులు నమో దు కావడంతో ఒడిశాకు వెళ్లి అక్కడి నుంచి తన మనుషుల ద్వారా గంజాయిని పంపిస్తున్నట్లు ఎక్సైజ్‌ సూపరిండెంట్ అంజి రెడ్డి తెలిపారు. ఈ కేసులో గంజాయి తెచ్చిన వ్యక్తితో పాటు కొనుగోలు చేసిన అశోక్‌సింగ్‌, గంజాయిని పంపిన మిలన్‌దేవ్‌నాథ్‌పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కొత్తగా వచ్చిన ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ చట్టాల ప్రకారం సెక్షన్‌ 105 అండ్‌ 185 బీఎన్‌ఎస్‌ఎస్‌ (కొత్తచట్టం) ప్రకారం వీడియో తీయించి పకడ్బందిగా కేసును నమోదు చేసినట్లు ఎస్టీఎఫ్‌ పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ సూపరిండెంట్ ఎన్‌ అంజి రెడ్డితోపాటు సీఐ ఎంపిఆర్‌ చందశ్రేఖర్‌, ఎస్సై సాయికిరణ్‌, సిబ్బంది యాదగిరి రాజు, యాదగిరి, మహేష్‌, రజనీకాంత్‌, అశ్విన్‌, వాసు, ప్రభు, రాహుల్ ఉన్నారు. గంజాయిని పట్టుకున్న సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి, జాయింట్‌ కమిషనర్‌ ఖురేషి, అసిస్టెంట్‌ కమిషనర్ పీ ప్రణవి అభినందించారు.

Post a Comment

0 Comments