కర్ణాటకలోని హాసన్‌లోని హోయసళ నగర్‌లో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని కాల్చి చంపి తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మొదట పోలీసులు అనుకున్నారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇద్దరిని మరి కొందరు పట్టపగలు కాల్చి చంపేసి తప్పించుకుని వెళ్లిపోయారని అనుమానం రావడంతో హాసన్ తో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు నాకాబందీ కొనసాగిస్తున్నారు. ఓవ్యక్తి వచ్చి కారును ఖాళీ ప్రదేశంలో ఆపాడు. కారులో ఉన్న వాళ్లు దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడాడు. అంతలో అకస్మాత్తుగా కారు దగ్గర తుపాకీ నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. ఈ శబ్ధం విని స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు షాక్ అయ్యారు. తుపాకి కాల్పుల శబ్దం విన్న ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. హాసన్ లోని కే.ఆర్. పురం స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యలు జరిగిన ప్రాంతంలో పోలీసులు కొన్ని సాక్షాలు సేకరించారు. బెంగళూరుకు చెందిన ఆసిఫ్, హాసన్‌కు చెందిన షౌకత్ అలీలు హత్యకు గురైనారని పోలీసులు అంటున్నారు. వీరిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, హాసన్‌లో సైట్ చూసేందుకు వచ్చి కారులో కూర్చుని చాలా సేపు మాట్లాడుకున్నారని, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య గొడవ మొదలైంది. ఆ సందర్బంలో తుపాకీ పట్టుకున్న వ్యక్తి ఆసిఫ్, షౌకత్ ఆలీలపై కాల్పులు జరిపారు. హత్య చేసిన వ్యక్తులను స్థానికులు ఎవ్వరూ చూడలేదని పోలీసులు అంటున్నారు. వ్యాపార లావాదేవీల కారణంగా జంట హత్యలు జరిగి ఉంటాయని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఒక శవం కారులో ఉందని, మరొక శవం కారు ముందు భాగంలో నేల మీద పడి ఉందని పోలీసు అధికారులు తెలిపారు. హాసన్ నగరంలో పట్టపగలు ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు హత్యకు గురికావడం కలకలం రేపింది.
ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల హత్య ?
الخميس، 20 يونيو 2024
Criem karnataka ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల హత్య ? పట్టపగలు కాల్చి చంపేసి తప్పించుకుని వెళ్లిపోయారని అనుమానం పోలీసులు నాకాబందీ కొనసాగిస్తున్నారు హాసన్‌లోని హోయసళ నగర్‌లో
ليست هناك تعليقات:
إرسال تعليق