టలీలో జరుగుతున్న జీ 7 సమ్మిట్ లో అగ్ర నేతలంతా ప్రత్యక్షమయ్యారు. దీంతో ఒకరినొకరు పలకరించుకుంటూ ఉత్సాహంగా సాగుతున్నారు. ప్రధాని మోడీ ఆయా దేశాధినేతలతో సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే జీ 7 సమ్మిట్‌లో భాగంగా అవుట్‌రీచ్ సెషన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోస్ ఫ్రాన్సిస్‌-మోడీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అంతేకాకుండా కొద్దిసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా బ్రిటీష్ ప్రధాని రిషి సునక్‌తో కూడా మోడీ సంభాషించారు. ఇదిలా ఉంటే జీ 7 సమ్మిట్‌లో తొలిసారి పోప్ ప్రసంగించనున్నారు. సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న తాజా పరిణామాలను ఉద్దేశించి పోప్ ప్రసంగించనున్నారు.

Post a Comment

أحدث أقدم