తెలంగాణలో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
0 Comments