యోధులు తిరిగి వచ్చారు : మహువా మొయిత్రా !


టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా 18వ లోక్‌సభ మొదటి రోజు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 2019, 2024కి సంబంధించిన కొంతమంది మహిళా ఎంపీలతో కలిసి ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియా వేదిక 'x'లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా 'యోధులు తిరిగి వచ్చారు' అని రాశారు. 2019 ఫొటోలో ఎంపీలు మహువా మొయిత్రా, కనిమొళి, సుప్రియా సూలే, జ్యోతిమణి, తమిజాచి తంగపాండియన్‌లు లోక్‌సభలో కూర్చున్నట్లు ఉండగా తాజా ఫొటోలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ఉన్నారు. మహువా మొయిత్రా పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. కనిమొళి తమిళనాడులోని తూత్తుకుడి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. మహారాష్ట్రలోని బారామతి స్థానం నుండి సుప్రియా సూలే, తమిళనాడులోని చెన్నై సౌత్ వెస్ట్ కరూర్ నుండి తమిజాచి తంగపాండియన్, ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి లోక్‌సభ స్థానం నుండి డింపుల్ యాదవ్ ఎంపీగా గెలుపొందారు. ఈ మహిళా ఎంపీలందరూ 18వ లోక్‌సభలో ప్రతిపక్ష పాత్ర పోషించనున్నారు. 18వ లోక్‌సభలో మొత్తం 74 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. 2019లో 78 మంది మహిళా ఎంపీలు ఉంటే.. ఇప్పుడు మరో 4 తగ్గారు. మహిళా ఎంపీల పరంగా పశ్చిమ బెంగాల్ ముందంజలో ఉంది. ఇక్కడ నుండి 11 మంది మహిళా ఎంపీలు విజయం సాధించారు. 

Post a Comment

0 Comments