హర్యానాలో మళ్లీ రాజకీయ అస్ధిరతకు తెరలేచే పరిస్ధితి నెలకొంది. హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా రాష్ట్ర గవర్నర్‌తో గురువారం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ రద్దు చేయాలని తాము రాష్ట్ర గవర్నర్‌ను కోరామని భూపీందర్ హుడా మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. సంఖ్యాబలం లేని సైనీ నేతృత్వంలోని కాషాయ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయిందని అన్నారు. వారు మెజారిటీని నిరూపించుకోవాలని కోరుకుంటే తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను వారు గవర్నర్ ముందు హాజరుపరచాలని చెప్పారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమవైపునకు తిప్పుకునే చర్యలను పాలక పక్షం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నైతికంగా ఈ ప్రభుత్వం కొనసాగే హక్కును కోల్పోవడంతో ప్రభుత్వం తక్షణమే తప్పుకోవాలని, మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని భూపీందర్ సింగ్ హుడా వ్యాఖ్యానించారు.
హర్యానా అసెంబ్లీ రద్దుకు మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా డిమాండ్ !
الخميس، 20 يونيو 2024
national భూపీందర్ సింగ్ హుడా రాష్ట్ర గవర్నర్‌తో భేటీ సంఖ్యాబలం లేని సైనీ అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయింది హర్యానా అసెంబ్లీ రద్దుకు భూపీందర్ సింగ్ హుడా డిమాండ్
ليست هناك تعليقات:
إرسال تعليق