విజయవాడలో తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం వద్దని మందలించిన వ్యక్తిపై కక్ష పెంచుకున్నాడో యువకుడు. పథకం ప్రకారం అతడిని హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బృందావన్‌ కాలనీలోని సింధూభవన్‌ వీధిలో కంకిపాటి శ్రీరామ్‌ప్రసాద్‌ (56) వంశీ జనరల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. వీరు విధ్యాధరపురం చెరువు సెంటర్‌లో నివాసముంటున్నారు. పెద్ద కుమార్తె దర్శిని (22) విజయవాడలోని శ్రీపొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతోంది. తన స్నేహితురాలు హరిత ద్వారా ఆమెకు గడ్డం శివ మణికంఠతో నాలుగేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వివాహం చేసుకుందామని ఇద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. వేర్వేరు కులాలు కావడంతో వారు అంగీకరించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీరామ్‌ప్రసాద్‌ కొందరు వ్యక్తులతో కలిసి శివమణికంఠను మందలించాడు. ప్రేమ వ్యవహారానికి దూరంగా ఉండాలని యువకుడి తల్లి కూడా అతడిని వారించింది. దీంతో కోపోద్రిక్తుడైన శివమణికంఠ గురువారం రాత్రి 9 గంటల సమయంలో దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న శ్రీరామ్‌ప్రసాద్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కిందపడిన ఆయనపై పలుమార్లు కత్తితో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీరామ్‌ప్రసాద్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కృష్ణలంక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు.

Post a Comment

أحدث أقدم