హిస్టరీ మళ్లీ రిపీట్ అవ్వడం పక్కా !


తెలంగాణలో వరుస పార్టీ ఫిరాయింపులపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. 2004-06 సమయంలో ఇలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పిరాయింపులు చేసిందని, కానీ ప్రజల పోరాటాలకు తల వంచిందన్నారు. హిస్టరీ మళ్లీ రిపీట్ అవ్వడం పక్కా అని చెప్పారు. ఈ ట్వీట్ కి ఓ నెటిజన్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. చేసిన పాపాలు అనుభవించక తప్పదు.. అప్పుడు మీ టైం, ఇప్పుడు వాళ్లది అని కేటీఆర్ ట్వీట్ కరెక్ట్ అంటూ ఓ ఫొటో కామెంట్ కి జత చేశారు. 2014-23లో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డామని, తెలంగాణ ప్రజల పోరాటానికి బీఆర్ఎస్ తల వంచిందంటూ తెలిపాడు. హిస్టరీ రిపీట్ అయిందని తెలిపాడు. ఆనాడు టీడీపీ, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను మీరు తీసుకున్నారు కదా అంటూ ఫైర్ అయ్యాడు.

Post a Comment

0 Comments