ఢిల్లీలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కోసం ఎంపీలంతా ప్రస్తుతం నగరంలోనే ఉన్నారు. ఈ వర్షాలతో వారి నివాసాలు కూడా నీటిలో చిక్కుకుపోయాయి. నీటి ఎద్దడి పరిష్కరించాలంటూ ఇటీవల నిరాహారదీక్ష చేసిన ఆప్ నేత, ఢిల్లీ జలమంత్రి ఆతిశీ ఇల్లు కూడా వాటిల్లో ఉంది. తన ఇంట్లోని సామాన్లన్నీ పాడైపోయాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించారు. ''నేను నిద్రలేచేసరికి అన్ని గదులు నీటితో నిండిపోయాయి. కార్పెట్స్, ఫర్నిచర్ సహా నేలమీద ఉన్న సామాన్లన్నీ పాడైపోయాయి. డ్రైనేజీలు మూసుకుపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సమయంలో కరెంట్ షాక్‌లను నివారించేందుకు ఉదయం ఆరు గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు'' అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో తాను పార్లమెంట్‌కు సమయానికి వచ్చానని చెప్పారు. ఈ వర్షాలతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. లోథి ఎస్టేట్ ప్రాంతంలోని నివాసం వద్ద నీరు నిలవడంతో సిబ్బంది ఆయన్ను ఎత్తుకొని కారులో కూర్చోపెట్టారు. పార్లమెంట్‌కు వెళ్లేందుకే ఇదంతా అని యాదవ్ వెల్లడించారు. తన ఇల్లంతా నీటితో నిండిపోయిందని, రెండు రోజుల క్రితం చేసిన ఫ్లోరింగ్ అంతా పాడైపోయిందని చెప్పారు. ఫ్లోరింగ్ కోసం వెచ్చించిన సొమ్మంతా వృథా అయిందన్నారు.
ఢిల్లీలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం !
الجمعة، 28 يونيو 2024
national ఇంట్లోని సామాన్లన్నీ పాడైపోయాయని శశిథరూర్ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడి ఎంపీ రామ్ గోపాల్ యాదవ్‌ను ఎత్తుకొని కారులో కూర్చోపెట్టారు ఢిల్లీలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం
ليست هناك تعليقات:
إرسال تعليق