భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ?


భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా అపాయింట్ కానున్నారు. ఆయన పేరును ఈ నెలాఖరున అధికారికంగా బీసీసీఐ ప్రకటించనుంది. రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ ఇదివరకే ముగిసింది. జూన్ 29వ తేదీ నాటికే ఆయన కాల పరిమితి ముగిసింది. దాన్ని రెన్యూవల్ చేయలేదు. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఆయనను అదే హోదాలో కొనసాగిస్తోంది. ఈ నెల 29వ తేదీన టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్. దీనితో ఈ బిగ్గెస్ట్ టోర్నమెంట్‌కు తెర పడుతుంది. ఫైనల్స్ ముగిసిన తరువాత రెండు రోజుల్లో టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరును బీసీసీఐ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సూపర్ 8కు చేరింది. ఈ నెల 19వ తేదీ నుంచి సూపర్ 8 మ్యాచ్‌లు ఆరంభమౌతాయి. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్, బంగ్లాదేశ్.. ఇందులో తలపడనున్నాయి. హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులను సైతం స్వీకరించింది బీసీసీఐ. మే 27వ తేదీని డెడ్ లైన్‌గా పెట్టి.. అప్లికేషన్లను ఆహ్వానించింది. వాటన్నింటినీ వడబోసింది. ఆ తరువాత గౌతమ్ గంభీర్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

Post a Comment

0 Comments