మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రూ.300 కోట్ల ఆస్తిని లాక్కోవడానికి కోడలు తన సొంత మామని కాంట్రాక్టు ఇచ్చి హత్య చేయించింది. తొలుత ఈ కేసును యాక్సిడెంట్‌గా చూపించే ప్రయత్నం జరిగింది. మే 22న నాగ్‌పూర్‌లోని మానేవాడ కాంప్లెక్స్‌లో పురుషోత్తం పుట్టేవార్ (82 )ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు మృతి చెందారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ప్రమాదంపై పోలీసులు ప్రాథమికంగా కేసు నమోదు చేశారు. ఘటన అనంతరం మృతుడి సోదరుడు తనకు హత్యగా అనుమానిస్తున్నట్లు పోలీసు అధికారికి తెలిపారు. ఆ దిశగా పోలీసులు విచారణ ప్రారంభించగా.. ఒకదాని తర్వాత మరొకటి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో సీసీటీవీ ఆధారంగా పోలీసులు కారు డ్రైవర్లు నీరజ్ నిమ్జే, సచిన్ ధర్మిక్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో.. ఇద్దరూ మృతుడి కోడలు అర్చన పుట్టేవార్ నుంచి డబ్బు తీసుకొని ఆమె మామగారిని కారుతో ఢీకొట్టినట్లు పోలీసులకు చెప్పారు. అర్చన ప్రభుత్వ అధికారి అనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
ఆస్తి కోసం మామను హత్య చేయించిన కోడలు !
الجمعة، 7 يونيو 2024
Criem maharashtra nagpur ఆస్తి కోసం మామను హత్య చేయించిన కోడలు మామని కాంట్రాక్టు ఇచ్చి హత్య చేయించింది రూ.300 కోట్ల ఆస్తిని లాక్కోవడానికి
ليست هناك تعليقات:
إرسال تعليق