ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్ కి జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ గతంలో నోటీసు ఇచ్చింది. అయితే రాత పూర్వక వివరణకు డెడ్ లైన్ నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే శనివారం జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ కి 12 పేజీలతో కూడిన లేఖను కేసీఆర్ రాశారు. లేఖలో రాజకీయ కక్షతోనే దురుద్దేశపూర్వకంగా విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కమిషన్ విచారణ పారదర్శకంగా లేదని, విచారణ పూర్తికాకుండానే ప్రెస్ మీట్ పెట్టారని ఆక్షేపించారు. అందులో కూడా పదేళ్లు సీఎంగా పనిచేసిన తన పేరును ప్రస్తావించారని తెలిపారు. చైర్మన్ వ్యాఖ్యలు బాధ కలిగించాయని పేర్కొన్నారు కేసీఆర్. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించిందని, జూన్ 15 లోపే సమాధానం ఇవ్వాలని అనుకున్నానని తెలిపారు. కానీ విచారణ నిష్పక్షపాతంగా లేదని అర్థమైందని వెల్లడించారు. కమిషన్ ఎదుట తాను హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు అనుకున్నానని లేఖలో ప్రస్తావించారు కేసీఆర్. తమ ప్రభుత్వ హయాంలో కరెంట్ విషయంలో విప్లవాత్మక మార్పులను చేసి చూపించామని తెలిపారు. ప్రజలకు 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందజేశామని అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ రంగం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అది జగమెరిగిన సత్యమని అన్నారు. కరెంట్ కోతలతో మోటార్లు కాలిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడే వారని వివరించారు. ఆ కాలంలో జనరేటర్లు, ఇన్వర్టర్ల కాలమే నడిచిందిని తెలిపారు. అయితే, లేఖ చివర్లో ‘ఎక్వయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నరసింహారెడ్డికి కేసీఆర్ సూచించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి కేసీఆర్ లేఖ !
السبت، 15 يونيو 2024
telangana ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి కేసీఆర్ లేఖ భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా సూచన
ليست هناك تعليقات:
إرسال تعليق