లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి వీడియో విడుదల చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై మోడీ ప్రభుత్వంతో చర్చలు జరపడమే ఇండియా కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. శుక్రవారం లోక్‌సభలో నీట్ అంశం మాట్లాడుతుండగా తన మైక్ కట్ చేశారని మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ గురించి అందరికీ తెలుసన్నారు. విద్యార్థులకు నష్టం కలిగించి, కొందరు మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా చదువుతుంటారని గుర్తు చేశారు. పవిత్రమైన వైద్య వృత్తిని చేపట్టడం వారి కల అని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాల సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు తెలిపారు. విద్యార్థుల తరఫున పోరాడాలని నిర్ణయించామన్నారు. ఏడేళ్లలో 70సార్లు పలు పరీక్షల ప్రశ్న పేపర్‌లు లీక్ అయ్యాయని, లీకుల కారణంగా రెండు కోట్ల మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారని రాహుల్ విమర్శించారు. దీనికి పరిష్కారం చూపాలని విద్యార్థులు ప్రధాని మోడీని కోరుతున్నా ఆయన మౌనం వీడట్లేదన్నారు.
'నీట్'పై ప్రభుత్వంతో చర్చకు రెడీ !
الجمعة، 28 يونيو 2024
'నీట్'పై ప్రభుత్వంతో చర్చకు రెడీ national ఏడేళ్లలో 70సార్లు పలు పరీక్షల ప్రశ్న పేపర్‌లు లీక్ నీట్ అంశం మాట్లాడుతుండగా తన మైక్ కట్ చేశారు రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి వీడియో విడుదల
ليست هناك تعليقات:
إرسال تعليق