ధనలక్ష్మీ బ్యాంకుకు కొత్త ఎండీగా కేకే అజిత్‌ కుమార్‌ !


కేరళకు చెందిన ధనలక్ష్మి బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా కేకే అజిత్‌ కుమార్‌ను నియమించినట్లు ఆ బ్యాంక్‌ మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. జూన్‌ 20 నుంచి వచ్చే మూడు సంవత్సరాల కాలానికి బ్యాంకు ఎండీ, సీఈఓగా వ్యవహరిస్తారు. ఆయన నియామకాన్ని మంగళవారం జరిగిన సమావేశంలో బోర్డు ఆమోదించింది. ఏప్రిల్‌ 18న ఈ నియామకానికి ఆర్‌బీఐ సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది. అజిత్‌ కుమార్‌కు.. క్రెడిట్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, బిజినెన్‌, బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ మొదలైన డిపార్ట్‌మెంట్స్‌లో ఫెడరల్‌ బ్యాంక్‌లో 36 సంవత్సరాల అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన ప్రెసిడెంట్‌ క్యాడర్‌లో ఫెడరల్‌ బ్యాంకులో చీఫ్‌ హెచ్ ఆర్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు.

Post a Comment

0 Comments