రింగ్ రోడ్డు నిర్మాణం కోసం తమ భూములను లాక్కోవద్దని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్వాయ్ ని ఆదివారం నిర్వాసితులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. కనగల్ మండలం ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ దేవి బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్న వెంకటరెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని మంత్రిని వేడుకున్నారు. రెండు నెలలుగా తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నా ఎవరు తమకు న్యాయం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలైన్మెంట్ 3 ప్రకారం కాకుండా అలైన్మెంట్ 1 ప్రకారం రింగురోడ్డును నిర్మించి తమ ఇండ్లకు, ప్లాట్లకు రక్షణ కల్పించాలని నిర్వాసితులు మంత్రి వెంకటరెడ్డిని వేడుకున్నారు. అయితే ఇప్పటికే రోడ్డు నిర్మాణ ప్రక్రియ పూర్తి అయిందని మంత్రి చెప్పడంతో నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకున్న రింగురోడ్డు నిర్వాసితులు !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق