ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ గురువారం సాయంత్రం కలిశారు. అరవింద్ కేజ్రీవాల్‌ను మూడు రోజుల పాటు సీబీఐ రిమాండ్‌కు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌ను ప్రతిరోజూ 30 నిమిషాల పాటు కలిసేందుకు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ను కోర్టు అనుమతించింది. ఇక కేజ్రీవాల్‌ను జైల్లోనే ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలతో కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సునీతా కేజ్రీవాల్ అంతకుముందు ఆరోపించారు. కేజ్రీవాల్‌ను జైల్లో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం తన వ్యవస్ధలన్నింటినీ ప్రయోగిస్తోందని ఇది నియంతృత్వం, ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆమె దుయ్యబట్టారు. కేజ్రీవాల్‌కు జూన్ 20న బెయిల్ లభించగా, వెంటనే ఈడీ స్టే ఉత్తర్వులు తీసుకుంది..ఆ మరుసటి రోజే సీబీఐ ఆయనపై అభియోగాలు మోపింది ఆపై ఆయనను అరెస్ట్ చేశారని సునీతా కేజ్రీవాల్ పేర్కొన్నారు.
సీబీఐ ప్రధాన కార్యాలయంలో కేజ్రీవాల్‌ను కలిసిన సునీతా !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق